కవిత (Kavitha) పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు చేసారు.. కవిత సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో పర్యటించి.. నియోజకవర్గ అభివృద్దిపై విమర్శలు చేసిన నేపథ్యంలో.. దీనికి కౌంటర్‌గా కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కవిత సోమవారం (నిన్న) జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లిలో పర్యటించి వై జంక్షన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Read Also: HYD: విశ్వవిద్యా కేంద్రంగా తెలంగాణ
కూకట్‌పల్లి హైదరాబాద్‌కు కామధేనువుగా మారిందని ఇక్కడ సుమారు రూ. 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను గత ప్రభుత్వం విక్రయించినప్పటికీ కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆమె విమర్శించారు. కవిత (Kavitha) చేసిన ఈ విమర్శలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదే స్థాయిలో, వ్యక్తిగత ఆరోపణలతో కౌంటర్ ఇచ్చారు. కవిత చరిత్ర ఏంటో తనకు తెలుసునని ఆయన అన్నారు. ఆమె ఏ బంగారం దుకాణాన్ని వదల్లేదని అన్నారు.

హరీశ్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కవిత ప్లాన్ వేశారని అన్నారు. కేసీఆర్ పై అభిమానంతో తాము కవితపై మాట్లాడటం లేదని మాధవరం కృష్ణారావు అన్నారు. కవిత సంగతి.. ఆమె భర్త సంగతి తనకు పూర్తిగా తెలుసునని అన్నారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసునని మాధవరం కృష్ణారావు అన్నారు. నీ బండారం బయటపెడితే నువ్వు బయట కూడా తిరగలేవని మాధవరం కృష్ణారావు అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: