ఇటీవల హైదరాబాద్లో మిస్ వరల్డ్ (Miss World) పోటీలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఒకవిధంగా చెప్పాలంటే ఈ ఈవెంట్ జరిగిన దాదాపు పదిరోజులపాటు హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా పోటీలో పాల్గొనేందుకు వచ్చిన అందగత్తెల హడావుడి జరిగింది. పలు ప్రాంతాల్లో పర్యటించి షాపింగ్ మాల్స్, వీధుల్లో సందడిచేశారు. అన్నీ ఈవెంట్లోను తమ ప్రతిభను చూపేందుకు పోటీపడ్డారు. అయితే ఈ పోటీల నిర్వహణపై ఆర్టీఐ యాక్టివిస్ట్ (RTI Activist) అడిగిన ప్రశ్నలకు తెలంగాణ టూరిజం శాఖ పొంతనలేని సమాధానాలను ఇస్తున్నది. వివరాలను ఇవ్వండి.. తెలంగాణలో నిర్వహించిన మిస్ వరల్డ్ (Miss World) పోటీలకు సంబంధించిన వివరాలు, ఆ పోటీల్లో ప్రభుత్వభాగం ఎంత అనే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి ఆర్టీఐ అప్లికేషన్ పెట్టిన ఆర్టీఐ యాక్టివిస్ కరీం అన్సారీ (Karim Ansari) అడిగారు. ఈ లేఖను టీజీటీడీసీ, కల్చరల్ డిపార్టమెంట్కు బదిలీ చేశారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ.

మా శాఖకు సంబంధించినది కాదు: టూరిజం శాఖ
ఈనెల 22వ తేదీన ‘ఈ విషయం మా శాఖకు సంబంధించినది కాదు’ అంటూ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది టూరిజం శాఖ. మిస్ వరల్డ్ పోటీలు ప్రైవేటు వ్యవహారాలు కాదని, ప్రజల టాక్స్ డబ్బులతో నిర్వహించిందని వీటి గురించి అడిగిన వివరాలకు సమాధానం ఇవ్వకపోవడం అప్రజాస్వామ్యం అని కరీం అన్సారీ పేర్కొన్నారు.
మొదటి మిస్ వరల్డ్ విజేత ఎవరు?
1951 మిస్ వరల్డ్ పోటీ విజేత, స్వీడన్‌కు చెందిన కెర్స్టిన్ “కికి” హకాన్సన్ బికినీలో కిరీటం ధరించినప్పుడు, అది వివాదానికి మరింత బలం చేకూర్చింది. ఈ పోటీని మొదట బ్రిటన్ ఫెస్టివల్ కోసం ఒక పోటీగా ప్లాన్ చేశారు, కానీ మోర్లీ మిస్ వరల్డ్ పోటీని వార్షికంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఫేమస్ మిస్ వరల్డ్?
ఫ్లాష్‌బ్యాక్ మిస్ వరల్డ్ – ఐశ్వర్య రాయ్ (మిస్ వరల్డ్ 1994) తరచుగా అత్యంత ప్రసిద్ధ & విజయవంతమైన మిస్ వరల్డ్ విజేతగా పరిగణించబడుతుంది. మిస్ ఫోటోజెనిక్ మరియు మిస్ వరల్డ్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ (ఆసియా & ఓషియానియా) గెలుచుకున్న ఏకైక టైటిల్ హోల్డర్ ఆమె.
Read hindi news: hindi.vaartha.com
Read also: BC Welfare : బిసిలకు పెద్దపీట వేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే