మెదక్ Minister Vivek : భారీ వర్షాల (Heavy rains) నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. బుధవారం మెదక్ జిల్లాలో కురిసిన వర్షంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం మెదక్ లో పర్యటించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నిన్న నక్క వాగు దగ్గర కారు కొట్టుకుని పోయిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న మెదక్ జిల్లా లో 11 మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదుకావడం జరిగిందని అన్నారు. 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ 4 మండలాల్లో ఎక్కువ వర్షాలు పడ్డాయి హవేలీ ఘనపూర్ మండలంలో 200 మిల్లిమీటర్ కంటే ఎక్కువ పడిందని అన్నారు. రాష్ట్రంలో వర్షాల వల్ల మెదక్, కామారెడ్డి జిల్లా ఎక్కువ ఎఫెక్ట్ కావడం జరిగిందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నుండి స్పెషల్ డిజాస్టర్ టీమ్స్, ఆర్మీవారు కూడా రావడం జరిగిందని అన్నారు.

వరద ప్రాంతాల్లో మైనంపల్లి రోహిత్, హనుమంత్ రావు పర్యటన
స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు కలిసి ఆపరేషన్ లో కలిసి వరద ప్రాంతాలను పర్యవేక్షణ చేయడం జరిగిందని అన్నారు. సీఎం కార్యాలయం నుండి జిల్లాలో సహాయక చర్యల కోసం కావలసిన వాటిని అన్ని కూడా జిల్లా కార్యనిర్వాహణ అధికారులను సూచనలు చేయడం జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాకు తక్షణ సహాయం కోసం 1 crore rupees అందజేసినట్లు తెలిపారు. సీఎం ప్రతి శాఖ వారితో సమీక్ష సమావేశం నిర్వహించారని కావలసిన సహాయం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పోలీస్ శాఖ వారికి కూడా రోడ్డు, కట్టలు, చెరువులు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్న వాటికి బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రజలను ఆపదలో పడకుండా రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు సీఎం సూచనలు చేశారని అన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :