గరిడేపల్లి (నల్గొండ): నియోజకవర్గంలో(Constituency) రహదారుల నిర్మాణంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో కొత్త రహదారులను నిర్మిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు రూ.17 కోట్లతో నిర్మిస్తున్న రహదారుల పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలోని రోడ్లు నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో కొత్త రహదారులు నిర్మించేందుకు గరిడేపల్లి మండలానికి ఈ నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
Pawan Kalyan:తన ఆరోగ్యంపై ఆదరణ చూపినందుకు చంద్రబాబు, నారా లోకేశ్ లకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్

రహదారుల నిర్మాణం, ప్రయోజనాలు
రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లోపం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రోడ్డు నిర్మాణం జరిగే సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. సరైన రహదారుల నిర్మాణం ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి అధికంగా జరుగుతుందని తెలిపారు. ఆయన శంకుస్థాపన(Foundation stone laying) చేసిన రోడ్ల వివరాలు:
- గానుగబండ నుంచి పర్ రెడ్డిగూడెం గ్రామం వరకు: రూ. 1.40 కోట్లతో 2 కి.మీ.
- గానుగబండ నుంచి మఠంపల్లి మండలం హనుమంతుల గూడెం వరకు: రూ. 3.5 కోట్లతో 5 కి.మీ.
- కల్మలచెరువు నుంచి చెవ్వారిగూడెం మీదుగా దర్శించర్ల వరకు: రూ. 3.5 కోట్లతో 4.6 కి.మీ.
- కల్మలచెరువు నుంచి గానుగబండ వరకు: రూ. 2.8 కోట్లతో 4 కి.మీ.
- కల్మలచెరువు నుంచి సబ్ స్టేషన్ వరకు: రూ. 4.2 కోట్లతో 6 కి.మీ.
- కల్మలచెరువు నుంచి బత్తలపాలెం వరకు: రూ. 3.5 కోట్లతో 5 కి.మీ.
- కల్మలచెరువు నుంచి సోమల తండా వరకు రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారు.
మండల నాయకులపై మంత్రి అసహనం
గానుగబండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనీసం మైక్ సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న పనులను ప్రజలకు వివరించకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తమ పర్యటనకు వచ్చినప్పుడు తనతోపాటు ఉండేందుకు నాయకులు చూపిస్తున్న శ్రద్ధ గ్రామాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై చూపించడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మరోసారి లోపం జరగకుండా మండల పార్టీ బాధ్యులు చూసుకోవాలని ఆయన చురకలు అంటించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పనులకు శంకుస్థాపన చేశారు?
గరిడేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు రూ.17 కోట్లతో నిర్మిస్తున్న రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రహదారుల నాణ్యతపై మంత్రి ఏమని హెచ్చరించారు?
రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లోపం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: