తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాజనర్సింహ (Minister Rajanarsimha) శాసనమండలిలో ప్రకటించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ పేదలకు నాణ్యమైన కంటి వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి స్పష్టం చేశారు. కంటి సమస్యలు ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Read also: Pawan Kalyan: వంద మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలు
‘హబ్’ గా దేవి కంటి ఆసుపత్రి
ప్రస్తుత జీవనశైలి, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో కంటి సమస్యలు అధికమవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని కంటి వెలుగు తరహాలో తాత్కాలిక శిబిరాలకు పరిమితం కాకుండా, శాశ్వత ప్రాతిపదికన వైద్యం అందించేలా ‘ఐ కేర్ క్లినిక్స్’ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్లినిక్‌ల నిర్వహణలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ‘హబ్’ (Hub)గా వ్యవహరిస్తుంది.హబ్, క్లినిక్‌ల మధ్య సమన్వయం కోసం, స్క్రీనింగ్, సర్జరీలను పర్యవేక్షించడానికి ఒక ఆప్తాల్మాలజీ నిపుణుడిని ‘నోడల్ ఆఫీసర్’గా నియమించాము.

రాష్ట్రంలో కంటి వ్యాధుల తీవ్రతను అధ్యయనం చేయడానికి, సరైన చికిత్సా విధానాలను సిఫార్సు చేయడానికి ఇప్పటికే ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఐ కేర్ సెంటర్ల పనితీరుపై, విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుంటాం. ‘గత 2ఏళ్లలో 6,12,973 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయించాం. 33.65L మంది పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించి, 76,176 మందికి అద్దాలు పంపిణీ చేశాం’ అని వివరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: