కరీంనగర్లో జరిగిన కేంద్ర పట్టణాభివృద్ధి కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోలీసులపై మరియు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై మండిపడ్డారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 24×7 నీటి సరఫరా వ్యవస్థను మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభిస్తుండగా, మంత్రి పొంగులేటిని పోలీసులు పలుమార్లు పక్కకు నెట్టారు. ఈ ఘటనపై శ్రీనివాస్‌రెడ్డి అక్కడే ఉన్న కలెక్టర్‌పై మీకు కామన్ సెన్స్ లేదా? మీరు ఏమి చేస్తున్నారు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎక్కడ? అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరోవైపు కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా హౌసింగ్ బోర్డును పోలీసులు పూర్తిగా మూసివేశారు. బారికేడ్లు వేసి వివిధ మార్గాలను మూసివేయడంతో పాటు హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను ఉదయం నుంచి మూసివేశారు. అదే ప్రాంతంలో 24×7 నీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించిన అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగించారు.
మల్టీపర్పస్ పార్క్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం కాంప్లెక్స్ మరియు కుమార్‌వాడి హైస్కూల్ స్మార్ట్ స్కూల్‌ను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలర్, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.