లంగాణలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. దశలవారీగా రేవంత్ సర్కార్ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు విడతల వారీగా లబ్దిదారుల అకౌంట్లలో నిధులు జమ చేస్తోంది. దీంతో పాటు ఇల్లుకు తక్కువ ధరలో ఇసుక, ఇటుక వంటివి అందించేలా ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకోగా.. ముందుగా ఇల్లు లేని పేదలకు ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో మిగతావారు తమకు ఎప్పుడు మంజురు అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు.
Read Also: Nalgonda: భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని,
వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు (Minister Ponguleti).
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: