హైదరాబాద్ : దేవాదాయ శాఖ. (Endowment Department) ఫైల్స్ అన్ని ఆన్ లైన్ అందుబాటులో ఉంచనున్నట్లు దేవా దాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda surekha) అన్నారు. ఆమె సచివాలయంలో దేవాదాయ శాఖకు సంబంధించి ప్రధాన కార్యాలయం కమిషనరేట్లో ఇ-ఆఫీస్ సర్వీసును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ ఇ-ఆఫీస్ వల్ల దేవాదాయ శాఖలో సంస్కరణలు జరుగుతాయని, ఇదొక గొప్ప ముందడు గన్నారు. ఈ కార ఆఫీసు ద్వారా ఫైల్స్ త్వరగా, ఆలస్యం లేకుండా క్లియర్ చేయవచ్చన్నారు. డిజిటల్గా అన్నీ ట్రాక్ అవుతాయన్న సిబ్బంది మధ్య అపోహలు ఉండవన్నారు. అలాగే, ఫైల్స్ మాయం కావడం, తడిసిపోవడం, దొంగతనం లేదా అగ్ని ప్రమాదాల్లో నష్టం చెందడం లాంటి సమస్యలు ఉండవన్నారు.
ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఫైల్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుందని, ఉన్నతాధికారులు, ఇఆఫీసు వల్ల వారి కార్యాలయాల్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. అత్యవసర ఫైల్స్ ను ప్రత్యేకంగా గుర్తించేం దుకు ట్యాగ్ చేయవచ్చన్నారు. కొద్ది రోజుల్లో యాద గిరిగుట్ట టెంపుల్ సర్వీసులను కూడా డిజిటలైజ్ చేస్తామని, అనంతరం రాష్ట్రంలోని 30 పెద్ద దేవస్థానాలల్లో ఇ-ఆఫీసు సర్వీసులు (E-office service) వినియోగి స్తామన్నారు. దీంతో పాటు పీఏలు, సీసీలు లాంటి మధ్యవర్తుల జోక్యం చాలా తక్కువవుతుందన్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖలో ఫైల్స్ క్లియరెన్స్ పనితీరును వేగవంతం ప్రాధాన్యతస్తుందని మంత్రి అన్నారు. ఆనంతరం దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ మాట్లాడుతూ. ఈ కొత్త విధానం ద్వారా దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పెండింగ్ ఫైల్ వ్యవహారాలు వేగంగా, పారదర్శకంగా ముందుకు వెళ్ళనున్నాయన్నారు. ఇ-ఆఫీస్ సాఫ్ట్వేరు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిండని, దీంతోపాటు అప్లికేషన్ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని, పారదర్శకతకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఇ-ఆఫీసు ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి కొండా సురేఖ మొదటి ఫైల్ను ఈ అప్లికేషన్ ద్వారా ఆమోదించారు. ఒక కారుణ్య నియామక ప్రక్రియను పూర్తి చేశారు. నవీన్ కుమార్ అనే వ్యక్తికి తన తండ్రి మరణించగా దేవాదాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాన్ని మంత్రి సురేఖ మంజూరు చేశారు. ఇ-ఆఫీసు ప్రక్రియను విజయవంతంగా చేసినందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. వెంకటరావును మంత్రి అభినందించారు.
గత 15 రోజులుగా కమిషనర్ స్వయంగా కంప్యూట రైజేషన్ పనులను పర్యవేక్షించారని కొనియాడారు. ప్రతి సిబ్బందికి తగిన శిక్షణ కల్పించారని, ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలులోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. వెంకటరావు, ఎన్బసీ జాయింట్ డైరెక్టర్ రాఘవాదారి, టెక్నికల్ మేనేజర్ సవిత తదితరులు పాల్గొన్నారు.
READ MORE :