हिन्दी | Epaper

News Telugu: Roads- వరదల తో దెబ్బతిన్న రోడ్లపై నివేదిక సిద్ధం చేయండి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Sharanya
News Telugu: Roads- వరదల తో దెబ్బతిన్న రోడ్లపై నివేదిక సిద్ధం చేయండి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో కురిసిన అతి తీవ్ర భారీ వర్షాలకు తలెత్తిన వరదల కారణంగా వెయ్యికోట్ల విలువగల ఆర్ అండ్ బికి చెందిన రోడ్లు (Roads of R&B), వంతెనలు కల్వర్టు ఇతర మౌళిక వసతులు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయిలో ని ఇంజనీర్ల ప్రాథమిక సమాచారం వివరిస్తున్నాయని నష్టం తాలుకు అంశాలను పూర్తి సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్లకు తెలిపారు.

News Telugu
News Telugu

అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో సమావేశం

బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో గురువారం ఆర్ అండ్ బి శాఖ పై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఈఎన్సి జయ భారతి, సి. ఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్.ఈ ధర్మారెడ్డి పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy rains), వరదల వల్ల ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని రోడ్ల డ్యామేజ్ వివరాలపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కోతకు గురైన రోడ్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదలకు దెబ్బతిన్న స్టేట్ రోడ్స్, ఎన్ హెచ్ రోడ్స్, పలు కల్వర్టులు, మైనర్ బ్రిడ్జిల వివరాలు మంత్రి తెలుసుకొన్నారు. ఆ మౌళిక వసతుల జీవితకాలం ఎంతో నమోదు చేయాలని సూచించారు. పూర్తి శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.

హ్యామ్ విధానం ద్వారా మెరుగైన రోడ్లు

అతి కొద్ది రోజుల్లోనే హ్యామ్ విధానం ద్వారా మెరుగైన, నాణ్యమైన రోడ్లు వేసుకోబోతున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని, ఈ సీజన్ వర్షాలు తగ్గుముఖం పెట్టగానే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తి ప్రణాళిక బద్దంగా వెళ్తుందని చెప్పారు. కేంద్రం నుండి క్లియరెన్స్ రావాల్సిన ఎన్ హెచ్ ప్రాజెక్ట్స్ పై ఆరా తీసిన మంత్రి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తాను ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర పరిధిలోని ప్రాజెక్ట్స్ పై మాట్లాడానని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజప్తులు కూడా ఇచ్చామని వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి గుర్తు చేశారు. ఖానాపూర్ నుండి బెల్లాం, ఉట్నూర్ నుండి గుడిహత్నూర్ రోడ్ మార్గం పై మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే విజప్తి పై సానుకూలంగా స్పందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-tomato-prices-hike-hyderabad-andhra-karnataka-rains/telangana/534163/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

అంతుచిక్కని వైరస్‌.. వేల సంఖ్యలో కోళ్ల మృతి!

అంతుచిక్కని వైరస్‌.. వేల సంఖ్యలో కోళ్ల మృతి!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

📢 For Advertisement Booking: 98481 12870