మంత్రి జూపల్లి కృష్ణారావు
బోథ్ (ఆదిలాబాద్) : మండలంలోని రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌసన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) ప్రారంభించారు. ఇంటి లోపల డిజైన్, సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం టిజిడబ్ల్యుఆర్ జెసి రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాల (TGWR JC Residential School Junior College) (బాలికల) లో 4 కోట్ల 15 లక్షలతో నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ఎక్సైజ్, పర్యాటకం, సంస్కృతి, పురావస్తు శాస్త్ర ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
ఆయా శాఖల లో వచ్చిన దరఖాస్తులు
విద్యార్థులతో మాట్లాడుతూ కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని తెలిపారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడుతూ, పాఠశాల (School) లో డబ్బులు అడిగితే 9848014089 నెంబర్ కు మేసేజ్ చేయాలని, ఆయా శాఖల లో వచ్చిన దరఖాస్తులు ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉంచ కుండా వారం, పక్షం రోజుల్లో పరిష్కరించాలని అన్నారు. మెనూ ప్రకారం భోజనం, విద్యార్థుల పట్ల ఉపాద్యాయులు చూపిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక పరిచయ గార్డెన్ లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్ల మంజూరు పత్రాలను,

ఇందిరమ్మ ఇళ్లకు సంబందించి అలసత్వం ప్రజాపాలనలో
మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ, నూతన రేషన్ కార్డు (Ration card) లు పంపిణీ, చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరైనా లంచం అడిగిన ఇందిరమ్మ ఇళ్లకు సంబందించి ప్రజాపాలనలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్ల మంజూరు పత్రాలు స్వయం సహకార సంఘా (Self-help group) లబ్ధికి అందజేశారు. మహిళా వికాస జిల్లా సమైక్య సంఘాలకు 41,91,96,267 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, శాసన సభ్యుడు అనిల్ జాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: