మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా ఎస్సీ అభివృద్ధి శాఖ (SC Development Department) లో 1,392 పోస్టుల కొనసాగింపుకు ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ కేటగిరీలలో పని చేస్తున్న 1,392 పోస్టులను మరో యేడాదిపాటు కొనసాగిస్తూ జి.ఓ.ఆర్.టి నెం.1450 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు ఈ పోస్టులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రత్యేక న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత
పోస్టుల్లో 11 కాంట్రాక్టు, 197 పార్ట్ టైమ్, 1,184 అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. జీవో జారీ చేసిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Lakshman Kumar) మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో మూలంగా హాస్టళ్లు, ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ వసతిగృహాలు, జిల్లా కార్యాలయాలు, ప్రత్యేక న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత భర్తీ కానుందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి, పౌష్టికాహారం, ఆరోగ్యం, భద్రతతో పాటు మంచి విద్యా వాతావరణం ఏర్పడనుందన్నారు.
మంచి వాతావరణంలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. హాస్టళ్లలో సిబ్బంది లోటు తీర్చడం ద్వారా విద్యార్థుల సంరక్షణ, భోజనం, భద్రత అన్ని రంగాల్లో నాణ్యత పెరుగుతుందని.. నిరుద్యోగ యువత (Unemployed youth) కు ఉపాధి, వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు.

ప్రతి ఎస్సి విద్యార్థి మంచి వాతావరణంలో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. ఈ పోస్టుల కొనసాగింపు ఆ దిశగా మరో ముందడగన్నారు. జీవో ఆధారంగా జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది కొరత కూడా భర్తీ కానుంది.
క్రమబద్ధమైన వేతన చెల్లింపులు సులభతరం అవుతాయనీ
హాస్టళ్ల నిర్వహణలో సమర్థత పెరుగుతుంది. పారదర్శక నియామ కాలతో ఉద్యోగుల నమ్మకం పెరిగి, క్రమబద్ధమైన వేతన చెల్లింపులు సులభతరం అవుతాయనీ అధికారులు తెలిపారు. ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లు బలోపేతం కావడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టను న్నారు.
అణగారిన వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వం చూపుతున్న అంకితభావానికి ఇది మరో నిదర్శనం అని మంత్రి పేర్కొన్నారు. ఈ జి.ఓ. ద్వారా విద్యార్థుల సంక్షేమం కోసం కొత్త మైలురాయిని ప్రభుత్వం నిర్మించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) సంక్షేమ దృష్టిలో ఇది ఒక ప్రతిష్టాత్మక ముందడుగని మంత్రి అడ్లూరి అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: