हिन्दी | Epaper
భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్..

Telugu news: Messi: టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ

Tejaswini Y
Telugu news: Messi: టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ

మెస్సీ కోసం 2,500 మంది పోలీసుల మోహరింపు

ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Messi) హైదరాబాద్‌కు రానుండటంతో నగరంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెస్సీకి ఉన్న అపార క్రేజ్‌కి తోడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనడం వల్ల ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 2,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించి సమగ్ర భద్రత కల్పిస్తున్నారు.

Read Also: Messi Statue: 70 ఫీట్ల ఎత్తైన మెస్సి విగ్ర‌హం.. ఎక్కడంటే?

మెస్సీ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసుల ప్రత్యేక చర్యలు

ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో 300 మంది ట్రాఫిక్ పోలీసులను నియమించారు. అదనంగా, 1,500 మంది లా అండ్ ఆర్డర్(Law and order) సిబ్బంది, ఎస్బీ, సీసీఎస్, ఎస్వోటీ, ఆక్టోపస్‌ టీమ్‌లు కూడా విధుల్లో పాల్గొంటున్నాయి.

Messi
Messi match entry only for those with tickets

మెస్సీ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకుని రాచకొండ సీపీ సుధీర్‌బాబు పలు సూచనలు జారీ చేశారు. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుందని, టికెట్లు ఉన్నవారే స్టేడియం వైపు రావాలని సూచించారు. ప్రజా రవాణాను ప్రాధాన్యత ఇవ్వమని, కార్లలో వస్తే సీటింగ్‌కు తగ్గ సంఖ్యలోనే రావాలని కోరారు. పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశారు. ప్లేయర్లు మరియు వీవీఐపీలకు ప్రవేశం గేట్ నంబర్ 1 ద్వారా ఉంటుందని తెలిపారు.

సీసీటీవీలు, డ్రోన్లతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ

ఈ కార్యక్రమానికి ఇతర దేశాలనుంచి కూడా అభిమానులు రానుండటంతో, ప్రేక్షకులు క్రమశిక్షణగా వ్యవహరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. భద్రత పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగించబడుతున్నాయని, రాచకొండ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు ఐసీసీసీ నుంచి కూడా ఈవెంట్‌పై పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870