తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నిర్ణయం – మీనాక్షీ నటరాజన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ నేతలను మూడు వర్గాలుగా విభజించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ వర్గీకరణ ఆధారంగా ప్రాధాన్యత ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
మూడు గ్రూపులుగా విభజన
- కాంగ్రెస్‌లో ప్రారంభం నుంచే ఉన్న వారు – మొదటి గ్రూప్
- ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు – రెండో గ్రూప్
- అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరినవారు – మూడో గ్రూప్
ఈ విధంగా వర్గీకరణ ద్వారా పార్టీలో సమతుల్యతను తీసుకువచ్చేందుకు మీనాక్షీ నటరాజన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేతల స్పందన
తెలంగాణ ఇన్‌చార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గౌరవ మీనాక్షీనటరాజన్ గారి నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వాగతించారు. 2014 నుంచి పార్టీకి సేవలు చేసిన వారికి న్యాయం జరగాలని, ఈ నేపథ్యంలో ఒక లిస్ట్ తయారు చేసి ఆమెకు అందజేస్తామని తెలిపారు. త్వరలోనే వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు వెల్లడించారు.