మేడారం జాతరకు మెగా ఏర్పాట్లు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు. (Medaram Jatara) జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 19న మేడారం గద్దెల పునరుద్ధరణ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సహా మంత్రులు హాజరు కానున్నారు కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్, ఇతర మంత్రులకు మేడారం మహా జాతరకు ఆహ్వానం అందింది. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అందించారు.
Read also: Medaram Jatara: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లు
(Medaram Jatara) మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించింది. మేడారంలో ఇప్పటికే భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆది వారం సెలవు దినం కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహా రాష్ట్ర నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టి తమ భక్తిని చాటుకున్నారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రావాల్సిందిగా కోరుతూ సోమవారం లోక్భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సమ్మక్క కలిశారు. ఈమేరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. సారలమ్మ పూజారులుసమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మంత్రులు ఆహ్వానించారు.
సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను గవర్నర్ కు మంత్రులు వివరించారు. ఆలయ ఆచారం ప్రకారం గవర్నర్కు పూజారులు ఈవో వీరస్వామి ఆహ్వానం పలికారు. కాగా, జాతర విశిష్టతను గవర్నర్ కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ వివరించారు. శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్న పనుల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా పేరుగాంచిన మేడారంను సందర్శించాలని మంత్రులు చేసిన విజప్తికి గవర్నర్ స్పందించారు. ఆదివాసి సాంస్కృతిక వైభవంతో నిండిన ఆ మహా జాతరను తప్పకుండా ఒక రోజు స్వయంగా దర్శిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: