రూ.251 కోట్లతో సమ్మక్క సారలమ్మ Medaram ఆలయాభివృద్ది మంత్రులు సీతక్క, (seethakka) పొంగులేటి శ్రీనివాసరెడ్డి ములుగు జిల్లా బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర అభివృద్ధి పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఆదివాసి సాంప్రదాయాలను గౌరవిస్తూ, ఆదివాసీ పూజారుల సలహాలు సూచనలతో గద్దెల ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. ఈ క్రమంలో మేడారం (Medaram) అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించేందుకు మంత్రి పొంగులేటి మేడారం కదిలారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంకు సోమవారం హెలికాప్టర్ లో 12 గంటల 54 నిముషాలకు చేరుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, (ponguleti srinivasa reddy) మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ వచ్చారు. వారికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. శబరిష్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
Read Also: Vote Chori : జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు

Medaram development to go down in history
Medaram: మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా మంత్రి సీతక్క చొరవతో సీఎం రేవంత్ రెడ్డిసమ్మక్క సారలమ్మ ఆలయాభివృద్ధికి 251 కోట్ల రూపాయిలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ (sammakka saralamma) అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2026 జనవరిలో ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళాగా పేరు ప్రఖ్యాతలు గాంచిన సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుందని తెలిపారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మరో 71 కోట్ల రూపాయల పనుల కోసం టెండర్లు పిలిచామని సూచించారు. 2024 లో జరిగిన జాతరకు విచ్చేసిన భక్తుల సంఖ్య కంటే 2026 జనవరిలో జరిగే మహా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారి అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
మేడారం పర్యటనకు దూరంగా ఉన్న కొండా సురేఖ: గడచిన రెండు రోజుల క్రితం సామాజిక
మాధ్యమాలే వేదికగా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మధ్యలో టెండర్ల వార్ జరిగిందని విసృత ప్రచారం జరిగింది. ఈ ఘటనపై కొండా సురేఖ ఏఐసీసీ కార్యాలయానికి సైతం ఫిర్యాదు చేసిందనే సమాచారం కూడా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. సోమవారం మంత్రి పొంగులేటి మేడారం పర్యటన సందర్భంగా ఈ ఘటనకు సంబంధించి జర్నలిస్టులతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి అంటే ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క చొరవతోనే అభివృద్ధి పనులు వేగవంతం అన్నారు. సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, మహబూబాబాద్ ఎం.పి. నాయక్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఎస్.పి. శబరిష్, ఐటీడీఏ పి.ఒ. బలరాం చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగకళ్యాణి, ఈఎన్సి, ఆర్డీఓ వెం కటేష్, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మేడారం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది?
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాభివృద్ధికి ప్రభుత్వం మొత్తం రూ. 251 కోట్లను కేటాయించింది.
మేడారం అభివృద్ధి పనులను ఎవరు సమీక్షించారు?
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ సమీక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: