లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ (WCWD) ఆధ్వర్యంలో (Medak) మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని హేమ భార్గవి, జిల్లాలోని అంధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల పాలిట వరమని కొనియాడారు.
విద్య ద్వారా దివ్యాంగులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ లిపి మార్గదర్శకమని, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అదరపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రధానంగా అంధులు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. (Medak) ఈ కార్యక్రమంలో అంద ఉద్యోగులు సంఘం అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
Read also: Warangal Crime: భర్తపై కత్తితో దాడికి యత్నం.. వైరల్ అవుతున్న వీడియో

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: