हिन्दी | Epaper

Medak: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

Tejaswini Y
Medak: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

Medak: మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్ కు శిక్షణ కార్యక్రమం పూర్తయిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు-2026 లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్ కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Medak: Everything is ready for the counting of municipal elections.. Collector's key instructions!
Medak: Everything is ready for the counting of municipal elections.. Collector’s key instructions!

Read Also:Tiger: సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్ ప్రతి అంశంపైన సంపూర్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుసరించాల్సిన విధానం, లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్స్ ల ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు ఏవిధంగా చేపట్టాలి, కౌంటింగ్ టేబుల్స్, రౌండ్లు వారిగా ఫలితాలు వెల్లడిలో కౌంటింగ్ సూపర్వైజర్స్ తిసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజేంట్లు, అభ్యర్థులతో వ్యవహరించాల్సిన తీరు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి సందేహం వచ్చినా వెంటనే పై అధికారులను సంప్రదించాలని ఆయన తెలిపారు. నాలుగు మున్సిపాలిటీలకు కలిపి 31 కౌంటింగ్ సూపర్వైజర్స్ ,62 కౌంటింగ్ అసిస్టెంట్స్ ను నియమించుకోవడం జరిగిందని ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఒక రిటర్నింగ్ అధికారికి ఒక టేబుల్ చొప్పున నాలుగు మున్సిపాలిటీలకు 26 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు సూచించారు. ఫిబ్రవరి- 13 న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సిబ్బంది అందరూ ఐడి కార్డులు ధరించి ఫిబ్రవరి 13వ తారీకు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని అన్నారు.

ఉదయం 8 గంటలకల్లా మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండు దశలలో బ్యాలెట్ బాక్స్ ల ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని, మొదటి దశలో ప్రాథమిక కౌంటింగ్ , రెండవ దశలో వివరణాత్మక కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ఏజేంట్ల వివరాలు అందిన వారికే ఆర్వోలు ఏజేంట్లగా గుర్తింపు కార్డులు జారిచేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తరచుగా ఎదురయ్యే వివిధ సంఘటనలను ఏ విధంగా పరిష్కరించాలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్ కు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య

సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

విజయ్-సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

విజయ్-సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

UPSC విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

UPSC విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!

అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!

జర్నలిస్ట్ హత్య కేసు.. హైకోర్టులో ‘డేరా’ రామ్ రహీమ్‌ కు ఊరట

జర్నలిస్ట్ హత్య కేసు.. హైకోర్టులో ‘డేరా’ రామ్ రహీమ్‌ కు ఊరట

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870