हिन्दी | Epaper
ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Medak Counting Center: ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన బందోబస్తు

Tejaswini Y
Medak Counting Center: ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన బందోబస్తు

Medak Counting Center: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని వేస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్‌ను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు పరిశీలించారు. శుక్రవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడు స్థాయిల భద్రత, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ప్రవేశ–నిష్క్రమణ ద్వారాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.

Read also: Rural Governance: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు..

Medak Counting Center: Tight security arrangements for vote counting
Medak Counting Center: Tight security arrangements for vote counting

స్ట్రాంగ్ రూమ్ వద్ద త్రీ-లేయర్ సెక్యూరిటీ

అనుమతి లేని వ్యక్తులు స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు మరియు ఇతరులు పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు.

కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ టేబుళ్లు, అభ్యర్థుల ఏజెంట్లకు కేటాయించిన స్థానాలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల నియమావళి ప్రకారం సజావుగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత కొనసాగుతుందని, ప్రజలు మరియు అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారి వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ సీఐ మహేష్, ఆర్ఎస్ఐ మహిపాల్, ఎస్ఐ శిరీష తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870