Medak: మెదక్: మెదక్ (Medak) పట్టణంలోని పిల్లికొట్యాల శివారులో ప్రభుత్వ వైద్య కళాశాలకి శంకుస్థాపన, సర్వే నెంబర్ 890లో, 20 ఎకరాల విస్తీర్ణభూమిలో, రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో, నూతన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రావు శంకుస్థాపన చేశారు. వైద్యరంగ అభివృద్ధికి ఇది ఓ చిరస్మరణీయ ఘట్టమని, జిల్లా విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడం, వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు, విద్యార్ధులకు సహాయపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ: “ప్రభుత్వ ప్రాధినిధ్యంతో, సమగ్ర వైద్యసదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Read also: Election Organization : ఎన్నికల సంస్థపై కేంద్ర పెత్తనమా!

Another great milestone for medical education
మెడికల్ విద్యను అందించే
Medak: నూతన వైద్య కళాశాలతో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాథమిక వైద్యంతో పాటు అత్యంత ప్రధానమైన వైద్య విద్యను అందించేలా మెడికల్ కళాశాలను రూపొందిస్తున్నామన్నారూ. ప్రతిభావంతులకు మెడికల్ విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వo ముందడుగు వేస్తుందన్నారు. నూతనంగా నిర్మించనున్న వైద్య కళాశాల భవనాలు, అనుబంధ హాస్పిటల్ ఆధునాతన వైద్య సదుపాయాలతో నిర్మాణాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నితిన్ కాబ్రా, సూపర్డెంట్ సునీత, డి సి హెచ్ ఎస్ శివ దయాల్, ఎంసీఏ హెచ్ ఓ డి రాజశ్రీ, వివిధ,ప్రొఫెసర్లు, ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య శాఖా అధికారులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: