తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వైద్య విద్యా రంగానికి మరొక పెద్ద ఊరట లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఈ ఏడాది సువర్ణావకాశం రాబోతోంది. ఇటీవల నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తీసుకున్న కీలక నిర్ణయాలతో తెలంగాణలో ఎంబీబీఎస్ (MBBS) సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Banakacharla Project : నీటి హక్కుల విషయంలో రాజీలేదు – ఉత్తమ్
2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 9,340 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు అందుబాటులోకి రానున్నాయి.కొత్తగా మూడు ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచుతూ ఎన్ఎంసీ అనుమతి ఇవ్వడం ద్వారా సుమారు 200 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.
దీంతో పాటు ఈఎస్ఐ కళాశాలలో మరో 25 సీట్లు అదనంగా పెంచడానికి అనుమతి లభించింది. వీటితో పాటు కొత్తగా అనుమతి పొందిన కొడంగల్ వైద్య కళాశాల (Kodangal Medical College) కు 50 సీట్లు కేటాయించారు. ఈ తాజా పెంపుదల కారణంగా.. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 275 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా విద్యార్థులకు లభించాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలు
ఈ సీట్ల పెంపుదల, రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మరింత ఎక్కువ అవకాశాలను కల్పించింది. పెరిగిన సీట్లతో కౌన్సెలింగ్ ప్రక్రియ (Counseling process) లో అన్ని కళాశాలల్లో సీట్ల భర్తీ దాదాపుగా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అమ్మాయిలు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.
కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన మొత్తం విద్యార్థుల్లో దాదాపు 70 శాతం మంది అమ్మాయిలే కావడం విశేషం. ఈ గణాంకాలు వైద్య వృత్తిలో మహిళల ఆసక్తి, ప్రతిభ ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తోంది. మెరుగైన విద్యా వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలు అమ్మాయిలు వైద్య విద్య వైపు మొగ్గు చూపడానికి కారణాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న వైద్య కళాశాలలు, సీట్ల సంఖ్య వైద్య విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును సూచిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: