మావోయిస్టులపై(Maoist) కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో(Telangana) కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్(Jagan) పేరుతో ఒక లేఖ విడుదలైంది.
Read Also: Bihar Elections:తేజస్వీ యాదవ్ ధీమా – బీహార్‌లో ఆర్జేడీ విజయం ఖాయం

కాల్పుల విరమణ పొడిగింపు కారణాలు
గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయని మావోయిస్టు పార్టీ గుర్తు చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందని, ఈ క్రమంలో గత మే నెలలో తాము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని పేర్కొంది. గడిచిన ఆరు నెలల కాలంలో తాము అనుకున్న విధంగా శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామని, భవిష్యత్తులోనూ ఇలాంటి వాతావరణాన్నే ప్రజలు కోరుకుంటున్నారని లేఖలో రాసుకొచ్చారు.
కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని, ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో మాదిరిగానే సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు
అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో నెలకొన్న శాంతి వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దుందుడుకు చర్యలను అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, మేధావులు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: