440 లీడర్ల బదులు 16 డివిజన్లు..
డీలిమిటేషన్ ప్రక్రియతో మేడ్చల్ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందని మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఆవేదన వ్యక్తం చేశారు. ఉండాల్సిన చోట 440 లీడర్లకు బదులుగా కేవలం 16 డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేసి ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.
Read Also: KTR news : హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్…

జవహర్‌నగర్, బోడుప్పల్‌పై డీలిమిటేషన్ ప్రభావం
లక్షన్నర ఓటర్లు ఉన్న జవహర్‌నగర్(Jawaharnagar) ప్రాంతంలో కేవలం రెండు డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. అలాగే బోడుప్పల్, పిర్జాదీగూడ ప్రాంతాల్లోనూ రెండేసి డివిజన్లు(divisions) మాత్రమే ఉండటం వల్ల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని తెలిపారు. కీసర గ్రామాలను హైదరాబాద్ పరిధిలో కలపడం కూడా తగదని అభిప్రాయపడ్డారు.
మేడ్చల్ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. GHMCలో విలీనం చేయడంపై అభ్యంతరం లేదని, కానీ 150 డివిజన్ల చెత్తను జవహర్‌నగర్‌కు తరలించడం మాత్రం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తను తొలగించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: