TPCC president news : బీఆర్‌ఎస్ పాలనలో బంగారు తెలంగాణను పూర్తిగా భ్రష్టు పట్టించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని విమర్శించారు. నిరుద్యోగ యువత ఉసురు తగలడమే బీఆర్‌ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, ఇది తమ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా చూపిస్తుందని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని అన్నారు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి బయటపడుతుందనే (TPCC president news) భయంతోనే బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ చౌకబారు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
ఈ నెల 8న గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు. ఆదివారం జరిగిన జూమ్ సమావేశంలో ఈ విషయాలను ఆయన వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: