(ఈరోజు)మంగళవారం సాయంత్రం సచివాలయంలో అనూహ్యంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ (Madhu Yashki Goud), మంత్రి శ్రీధర్ బాబు ను కలవడానికి సచివాలయానికి వెళ్లిన సందర్భంలో ఒక అనుకోని పరిస్థితి ఎదురైంది. సమావేశం కొనసాగుతున్న సమయంలో మధు యాష్కీ గౌడ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి (Chest pain) తో కూలిపోయిన ఆయనను చూసి మంత్రి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు
సచివాలయంలోని డిస్పెన్సరీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ (First aid) చికిత్స అందించారు. ఆ తర్వాత హుటాహుటిన గచ్చిబౌలి (Gachibowli) లోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital) కి తరలించారు.వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే కాంగ్రెస్ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధు యాష్కీ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.తెలంగాణ రాజకీయాల్లో మధు యాష్కీ గౌడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. పార్లమెంట్‌లోనూ, రాష్ట్రంలోనూ ఆయన ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం ద్వారా గుర్తింపు పొందారు. అలాంటి నేత ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొనాలని అందరూ కోరుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: