- అతివేగం పనికిరాదు
- పాఠశాల విద్యార్థులకు భద్రతపై అవగాహన
- ఎన్హెచ్ఎఐ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి
వ్యక్తిగత భద్రతతోనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని, అతివేగం ఎంతమాత్రం పనికిరాదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఎఐ) ప్రాజెక్టు డైరెక్టర్ వై. మాదవి(Madhavi) అన్నారు. 37వ జాతీయ రహదారుల భద్రత మాసోత్సవంలో భాగంగా చౌటకూర్ మండలం తాడ్డానిపల్లి టోల్జా వద్ద మం గళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ. మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అందోళన వ్యక్తం చేశారు. రహదారులు నాడు చిన్నవిగా ఉండేవని నేడు నాలుగు, ఎనిమిది లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ, ఇంకా ప్రమాదాల సం భవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: CM Revanth : కెసిఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది – కేటీఆర్
రహదారులపై ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. కుటుంబ పెద్దపై ఆధారపడి అనేక మంది ఉంటారని, వారి బాగోగులను దృ షిలో ఉంచుకుని ప్రయాణించాలని సూచించారు. కారు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలన్నారు. భద్రత మాసోత్సవంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భద్రతపై(Madhavi) అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారులపై వెళ్లే సమయంలో అత్యంత జాగురూకతతో ఉండాలని, రహదారిపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను గమనిస్తూ ప్రయాణం సాగించాలన్నారు.
సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై కంది-రాంసానిపల్లి వరకు పలు గ్రామాల వద్ద అండర్పాస్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా శివంపేట, సింగూరు చౌరస్తా, సుల్తాన్పూర్ గ్రామాల కూడళ్ల వద్ద అండర్పాస్లు నిర్మించాలంటూ ప్రజలు డిమాండ్ చేసు న్నారని పేర్కొన్నారు. సుల్తాన్పూర్లో రహదారి విస్తరణకు ప్రార్ధన మందిరం అడ్డంకిగా మారిందని, అక్కడ సమస్యలు తలెత్తకుండా ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
సింగూరు చౌరస్తా టోల్ ప్లాజాకు అత్యంత సమీపంలో ఉన్నదని. టోల్ ప్లాజాలకు దగ్గరగా అండర్పాస్లు నిర్మించేం దుకు ఎన్హెచ్ఎఐ నిబంధనలు అంగీకరించవని. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారికిరువైపుల దాబా హోటళ్లు, పెట్రోలు పంపులు, వివిధ రకాల షెడ్లు, పరిశ్రమలు నిర్మించాలంటే ఎన్హెచ్ఎఐ అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. జోగిపేట సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమలు, పెట్రోలు పంపులు తదితర వాహనాలు నేరుగా హైవేపైకి ఎక్కడానికి వీలులేదని, సంబంధిత యాజమాన్యాలు ముందుగా సర్వీసు రోడ్లను ఏర్పాటు చేసుకుని జాతీయ రహదారిపైకి నెమ్మదిగా చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే, శివంపేట సమీపంలో పెట్రోలు వంపు, బీరు పరిశ్రమకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు అందజేశారని వెల్లడించారు. ఈ ‘ కార్యక్రమంలో ఎన్ఎచ్ఎఐ కన్సల్టెంట్ గౌస్పెషా, సెక్యూర్ ప్రాజెక్టు మేనేజర్ సుజీత్ చౌదరి, రూట్ ఆఫీసర్ సోహైల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: