తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” గీతానికి రూపకల్పన చేసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) (64) ఇక లేరు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also: TG: నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
తెలంగాణకు స్వరమిచ్చిన కవి
అందెశ్రీ (Ande Sri) కలం నుంచి జాలువారిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తన పాటలు, రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

ఉద్యమ సమయంలో ఆయన గీతాలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాయి.ఎటువంటి పాఠశాల విద్య అభ్యసించకుండా, కేవలం తన ప్రతిభతోనే గొప్ప కవిగా అందెశ్రీ (Ande Sri) పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఈ పాట ఆయనకు విస్తృతమైన కీర్తిని తెచ్చిపెట్టింది. అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: