హైదరాబాద్ Liquor Tenders : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించింది. డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30. 2027 వరకు లైసెన్స్ కాలం ఉంటుందని, ఈ సారి దరఖాస్తు ఫీజు (Application fee) రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడకుల స్తులకు 15 శాతం, ఎస్సీ సామాజిక వర్గాలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను కేటా యించనునున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. 2025-2027 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్శాఖ ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణలోని 2620 మద్యం షాపులకు లైసెన్స్ కొరకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న దుకా ణాల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఈ కొత్త లైసెన్సుల గడువు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు ఉంటుంది. ఈసారి దరఖాస్తు రుసుమును రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారు. దుకాణాల లైసెన్సులను వార్షిక ఎక్సైజ్ పన్ను ఆధారంగా లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ఈ మద్యం పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను రిజర్వ్ చేశారు.
ఎక్సైజ్ లైసెన్సులపై కొత్త స్లాబులు
ఇలా మొత్తం 30 శాతం రిజర్వేషన్లకు కేటాయించారు. వీటితో పాటు.. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఒకే దరఖాస్తుదారుడు ఒక దుకాణానికి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మొత్తం ఆరు స్లాబులుగా ఈ లైసెన్సుల ఫీజులను నిర్ణయించారు. ఇది 2011 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించబడింది. ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో వార్షిక ఎక్సైజ్ పన్ను రూ.50 లక్షలుగా, 5,000 నుండి 50,000 మధ్య జనాభా ఉన్నచోట రూ. 55 లక్షలుగా, 50,000 నుంచి ఒక లక్ష వరకు ఉన్న ప్రాంతాలకు రూ. 60 లక్షలుగా, ఒక లక్ష నుంచి ఐదు లక్షల మధ్య జనాభా ఉన్న ప్రదేశాల్లో రూ.65 లక్షలుగా నిర్ణయించారు. ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉంటే రూ.85 లక్షలు, ఇక 20 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో వార్షిక ఫీజు రూ. కోటి పది లక్షలుగా ఖరారు చేశారు.

మద్యం దుకాణాలపై కొత్త నియమాలు
లాటరీ ద్వారా దుకాణాలను పొందినవారు వార్షిక లైసెన్స్ రుసుమును ఆరు సమానవాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్ కాలానికి గాను, పావు వంతు (25 శాతం)కు సమానమైన బ్యాంక్ గ్యారెంటీని ప్రభుత్వానికి సమర్పించాలి. జీహెచ్ఎంసీ, నగర పంచాయతీ పరిధిలో మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతి ఉందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :