తెలంగాణలో మద్యం అమ్మకాలు (Liquor Sales) మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భారీగా మద్యం అమ్ముడుపోయింది. నాలుగు రోజుల్లో దాదాపు రూ. 600 కోట్ల మద్యం (Liquor Sales) అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగినట్లు వెల్లడించారు.
Read Also: BC Reservation : ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి – హరీశ్ రావు డిమాండ్

మద్యం అమ్మకాలు
గత ఏడాది నాలుగు రోజుల్లో 4.26 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడు కావడం గమనార్హం. డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రి వరకు 578.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
2023-2025 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాల్లో 724 లక్షల లిక్కర్, 960 లక్షల, బీర్ల అమ్మకాలు జరిగాయని సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: