జూన్ 25న కవిత భర్త కుమారస్వామి, ఆగస్టు 3న వర్షిణీ హత్య
జయశంకర్ భూపాలపల్లి : కాటారం పోలీస్ స్టేషన్లో గత నెల ఆగస్టు 25న నమోదైన కప్పల వర్షిణీ హత్య కేసుకు సంబంధించిన వివరాలను జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కథనం మేరకు గత నెల 28న కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో కమ లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని అమ్మాయి మృతదేహంపడి ఉందని, శవానికి చుట్టు పక్కల క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని సమాచారం రాగా కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్, సిఐ నాగార్జునరావు, డిఎస్సి సూర్యనారాయణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చనిపోయిన అమ్మాయి కప్పల వర్షిణీ గుర్తించారన్నారు.
తన సిబ్బందితో గంగారం క్రాస్ రోడ్
గత నెల 3వ తేదీ నుండి కనిపించడం లేదని వర్షిణి తల్లి అయిన కప్పల కవిత స్థానిక పోలీస్ స్టేషన్ చిట్యాలలో గత నెల 6న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా మంగళవారం కాటారం సిఐ నాగార్జున రావు తన సిబ్బందితో గంగారం క్రాస్ రోడ్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పైన మృతురాలి తల్లి అయిన కప్పల కవిత, మరొక వ్యక్తితో కొయ్యూరు నుండికాటారం వైపుగా వస్తుండగా పోలీసు చూసి తమ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయే ప్రయ త్నం చేయగా వెంబడించి పట్టుకొని విచారించగా, వారి నేరమును అంగీకరించినట్లు తెలిపారు. ఈమేరకు పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
ఓడతల గ్రామంలో
చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి తండ్రి సమ్మయ్య మొదటి భార్య చనిపోగా కొయ్యూరు మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన మాదరవేణి కవితను రెండో వివాహం చేసుకొన్నారు. వీరి ఇరువురికి ఇద్దరు ఆడ సంతానం. కాగా వారిలో పెద్ద అమ్మాయి కప్పల వర్షిణీ(22), చిన్న అమ్మాయి కప్పల హన్సిక (21) ఉన్నారు. కాగా చిన్న అమ్మాయికి వివాహమై ఇంటి నుండి వెళ్లిపోగా ఓడతల గ్రామంలో పెద్దమ్మాయి వర్షిణీ (Varshini) తో పాటు భార్య భర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా గత ఐదు సంవత్సరముల క్రితం కవిత భర్తకు పక్షవాతం వచ్చి ఇంటికి పరిమితమయ్యాడు. కాగా కప్పల కవితకు అదే గ్రామానికి చెందిన అవివాహితుడైన జంజర్ల రాజ్ కుమార్ తండ్రి మారయ్య (24) పరిచయంతో అక్రమ సం బంధం ఏర్పడిందన్నారు.
కవిత కదలకుండా కాళ్లు పట్టుకోగా
ఈ విషయం కప్పల కవిత భర్త కుమారస్వామికి తెలియడంతో తరచూ తగాదాలు జరుగుతున్నాయన్నారు. భర్తఆడ్డును తొలగించాలని భావించి జూన్ 25న తన కూతురు ఇంట్లోలేని సమయంలో భర్తను కవిత కదలకుండా కాళ్లు పట్టుకోగా రాజ్ కుమార్ నోరు మూసి గొంతు నొలిమి హత్య చేసి, అక్కడి నుండి వెళ్లిపోగా కవిత తన భర్త అనారోగ్యంతో చని పోయాడని ఊరివారిని, బంధువులని నమ్మించి అంత్యక్రియలు జరిపించారు.
తన కూతురు వర్షిణీని తన భర్తను
తర్వాత కొన్ని రోజులకు వర్షిణీ తన తల్లిని నిలదీయడంతో అమ్మాయిని అడ్డు తొలగిస్తే, అక్రమ సంబంధానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని రాజ్ కుమార్ తెలుపగా దానికి అంగీకరించిన కవిత ఇద్దరు కలిసి ముందస్తు పన్నాగంతో గత నెల 2న ఆర్థరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న తన కూతురు వర్షిణీని తన భర్తను చంపిన విధం గానే హత్య చేసి మృతురాలిని తన ఇంట్లో ఉన్న సంచిలో మూటకట్టి ఇంటి వెనకాల ఉన్న చెట్లపొదలలో దాచిపెట్టి, అదే రోజు రాత్రి అక్కడి నుండి ఒడితల గ్రామ శివారులో ఉన్న గవర్న మెంట్ హాస్పిటల్ వెనకాల ఉన్న దుబ్బగట్టుగుట్ట చెట్ల పొదలలో పడవేశారన్నారు.
ఒకసారి వెళ్లి చూసి వస్తూ అట్టి శవాన్ని
కాగా గత నెల 6న కప్పల కవిత చిట్యాల పోలీస్ స్టేషన్కి వచ్చి తన కూతురైన వర్షిణీ కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారన్నారు. ఇదిలా ఉండగా దుబ్బగట్టు గుట్టలో దాచిన శవంను రాజకుమార్ రెండు రోజులకు ఒకసారి వెళ్లి చూసి వస్తూ అట్టి శవాన్ని ఎవరైనా చూస్తే వారి ఇరువురి పైకి వస్తుందనే భయంతో గత నెల 25 సాయంత్రం ఏడు గంటల సమయం లో శవాన్ని రాజ్ కుమార్ యూరియా సంచిలో ఉంచి దానికి తాడుకట్టి టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పైన మధ్యలో శవాన్ని ఉంచుకొని ఒడితల గ్రామం నుంచి తీసుకొని వచ్చి కమలాపూర్ క్రాస్ రోడ్ దాటిన తర్వాత నేషనల్ హైవేకి పక్కన పడేయడం జరిగిందన్నారు.
ఎప్పటికైనా బయటకి వస్తుందన్న భయంతో
పోలీసువారి దృష్టి మరల్చడం కోసం శవం పైన పసుపు, కుంకుమ చల్లి, నిమ్మకాయలు ఉంచి శవ చ నువ మేకులు పూజలు చేసి చంపినట్లుగా చిత్రీకరించి అక్కడ నుండి ఒడితల గ్రామానికి వెళ్లిపోయి ఎవరికి ఏమీ తెలియనట్లుగా ఎవరింట్లో వారు ఉన్నారన్నారు. కవిత తన భర్తను, కూతురిని చంపిన విషయం ఎప్పటికైనా బయటకి వస్తుందన్న భయంతో రాజ్కుమార్తో కలిసి ఒడితల గ్రామంనుండి బస్వాపూర్ రోడ్డు మీదుగా కొయ్యూరు నుండి గంగారం క్రాస్ మీదుగా మహా రాష్ట్రవెళ్లే ఉద్దేశంతో వస్తూ ఉండగా పోలీసు వారు వారినిపట్టుకుని అరెస్టు చేసికోర్టుకు తరలించడం జరిగిందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: