తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Kaleshwaram Lift Irrigation Project) ఒకటి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణల మధ్య, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పీసీ ఘోష్ కమిషన్‌కి అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా కమిషన్ రూపొందించిన రిపోర్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ కేసును గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. విచారణలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడిందని వాదనలు వినిపించగా, హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రిపోర్టు ఎక్కడైనా పబ్లిక్ డొమైన్ (Public domain) లో ఉంచి ఉంటే వెంటనే తొలగించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ రిపోర్టును అసెంబ్లీకి సమర్పించక ముందే బయటకు రావడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.

మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని
అలాగే, అసెంబ్లీలో చర్చలు పూర్తయ్యాక మాత్రమే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ప్రభుత్వానికి మూడు వారాల గడువులోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.కేసు విచారణ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం రిపోర్టుపై విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితులను పరిగణనలోకి తీసుకొని, రాబోయే నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై మరలా విచారణ జరపాలని నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: