మంత్రి సీతక్కకు విజప్తి చేసిన ఎఐటియుసి నాయకులు
హైదరాబాద్ : అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరూతూ తెలంగాణ అంగన్వాడి టీచర్స్ హెల్ఫర్స్ అసోషియేషన్ (ఎఐటియుసి) (AITUC) రాష్ట్ర అధ్యక్షురాలు సాయీశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణకుమారి, రాష్ట్ర డిప్యూటి జనరల్ సెక్రటరి సీతా మహాలక్ష్మీలు మంత్రి సీతక్కకు విజప్తి చేశారు. ఈ మేరకు వారు బుధవారం సచివాలయంలో ఆమెకు వినతి పత్రం అందించారు. పోషణ్ ట్రాకర్ యాప్లో భాగంగా ఫేస్రికగ్నై జేషన్ సిస్టము అమలు చేయడంతో అంగన్ వాడీలు సేవలు అందించేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.

డిజిటైలేజషన్ ఆమోదించదగ్గదే
ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీ సేవలు గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు, 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు టేక్ హోమ్ రేషన్ (Take home ration) (టిహెన్ఆర్) మరియు పోషక సహాయం అందించేవని, అయితే, ఇప్పుడు ఎఫ్ఎర్ఎస్ అమలుతో అనేక మంది లబ్ధిదారులు పోషకాహారాన్ని పొందలేక పోతున్నారు. డిజిటైలేజషన్ ఆమోదించదగ్గదే కాని ఇది బలహీన వర్గాల కోసం ఇబ్బంది కలిగించే సాధనంగా మారకూడదన్నారు. ఎస్ఆర్ ఎస్ తప్పనిసరి అమలు రద్దు చేయాలని, ఆధార్ లేదా ఫేస్ రికగ్నిషన్ లేకుండా అర్హులైన లబ్ధిదారులు పోషణ పొందేలా చూడాలన్నారు. ఎన్హెచ్ఎటిఎస్ పోషణ ట్రాకర్ యాప్లను ఒకటిగా రూపొందించి సరళతరం చేయూలని మంత్రికి వారు విజప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: