కరీంనగర్ టౌన్ : జనహిత పాదయాత్ర రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మొదట దశలో జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. గురువారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈనెల 24 వ తేదీ చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామం నుండి కురిక్యాల చౌరస్తా మీదుగా గంగాధర వరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఉంటుందన్నారు.
సంక్షేమ పథకాల గురించి ప్రజలతో
కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ఈ పాదయాత్ర విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, అనుబంధ సంఘాలకు, పార్టీ అభిమానులకు విజప్తి చేశారు. జనహిత పాదయాత్ర ద్వారా 19 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలతో చర్చిస్తూ వారికి అందుతున్న వాటిపై ఆరా తీస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటారని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ పక్షాన వారికి అండగా ఉంటూ, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (AICC in-charge Meenakshi Natarajan) ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోఆర్డినేట్ చేస్తున్నారనీ తెలిపారు. 24న సాయంత్రం పాదయాత్ర తర్వాత గంగాధరలో బస ఉంటుందన్నారు.

ముఖ్య కార్యకర్తలతో
25న ఉదయం ప్రభుత్వ పాఠశాలలో శ్రమ దానం, మొక్కలు నాటే కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొంటారనీ తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల యజమానులు, సోలార్ యజమానులు, ఇందిరా క్యాంటీన్ యజమానులుగా ఉన్న మహిళలతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. జిల్లా ముఖ్య కార్యకర్తలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇష్టాగోష్టితో మాట్లాడతారనీ వివరించారు. కేటీఆర్ వాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్: కేటీఆర్ భాష థర్డ్ క్లాస్ కి మారిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి, పేద గ్రామీణ వ్యవసాయం కుటుంబం నుండి వచ్చి హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జి గా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని తెలిపారు.
ఆయన ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: