తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నల్గొండలో వేర్వేరు చోట్ల కేటీఆర్ మీద మూడు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మూడు కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ 2024 పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ గురించి అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ (KTR) ట్వీట్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు చోట్ల కేటీఆర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేటీఆర్ మీద కేసులు నమోదు చేశారు.

తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ
అయితే నల్గొండలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ కేటీఆర్ గతంలో హైకోర్టు (High Court) ను ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రెండు పక్షాల వాదనలు విన్నది.
తమకు సంబంధం లేకున్నా తమ పేర్లు ప్రస్తావించారంటూ కాంగ్రెస్ నేతల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించగా.. రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టారంటూ కేటీఆర్ తరుఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్‌పై నల్గొండలో నమోదైన మూడు కేసులను కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: