కేంద్ర సహకార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సిద్ధార్థ్ జైస్
హైదరాబాద్ (చిక్కడపల్లి) : దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలు గ్రామీణ సమృద్ధిని పెంచడంలో, ఆహార భద్రతను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర సహకార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సిద్ధార్థ్ జైస్ (Siddharth Jais, Joint Secretary, Ministry of Cooperation) అభిప్రాయపడ్డారు. బుధవారం సహకార తెలంగాణలో సహకార సంఘాల బలోపేతానికి నాబార్డ్ వర్కాప్ మంత్రిత్వశాఖ,
భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో హైదరాబాద్లో నిర్వహణ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్), తెలంగాణ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకార మంత్రిత్వశాఖ తెలంగాణ సహకార శాఖతో కలిసి “అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025” లోని “సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి” అంశంపై డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో “సహకార సంఘాల బలోపేతం” పై ప్రాంతీయ వర్క్ షాప్ జరిగింది.
వ్యవసాయ పరపతి సంఘాలు సాంకేతికతను స్వీకరించడం
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వశాఖ, రాష్ట్ర సహకార శాఖలు, ఎఫీసీఐ, ఆహారపౌర సరఫరా శాఖలు, రాష్ట్ర సహకార బ్యాంకులు, ఎస్ఐడీబీ, ఎస్ఎఫ్ఎబీ తెలంగాణ డీడీడీసీఎఫ్ నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సహకార సంఘాలు సమగ్రాభివృద్ధిని సాధించడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు సాంకేతికతను స్వీకరించడం ద్వారా గ్రామీణపట్టణ అంతరాలను తగ్గించాలని సూచించారు.
అదే విధంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల బోర్డు సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్త వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేయడం, స్టార్టప్లతో అనుసంధానం కల్పించాలని సూచించారు. నాబార్డ్ చైర్మన్ శాజి కె.వి (NABARD Chairman Shaji K.V.) మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో చేపట్టిన కంప్యూటరీకరణ ప్రాజెక్టుకు మంచి ఫలితాలు లభిస్తున్నాయని, ఇప్పటి వరకు 52,500కి పైగా సంఘాలకు డేఎండ్ ఆపరేషన్స్ పూర్తయ్యాయని, 9వేల సంఘాలు డైనమిక్ డే-ఎండ్ నిర్వహిస్తున్నాయి.

పనితీరు మెరుగవడంతో పాటు పునరావృతం
అలాగే 33వేలకు పైగా ఆడిట్లు ఇపిఎసిఎస్ సాఫ్ట్వేర్ పైగా సంభరాలచేశామని, అదనంగా 7,500కి ఇపిఏసిఎస్ ఓన్లీ’గా గుర్తించామన్నారు. రాష్ట్ర సహకార బ్యాంకులను ‘సహకారి సారథి” ప్లాట్ఫాంలో చేరి రైతులకు సులభమైన సేవలు అందించాలని సూచించారు. కంప్యూటరైజేషన్ ద్వారా ఏర్పడిన డిజిటల్ వేదిక సహకార సంఘాలకు వ్యాపార నమూనాలను విస్తరించడానికి, ఈ-మార్కెటింగ్ ప్రారంభించి “డానికి, గ్రామీణ సమాజానికి డిజిటల్ సేవలు అందించడానికి దోహదం చేయడంతో పాటు వ్యాపార ప్రక్రియల పునర్వ్యవస్థీకరణ, ఉన్నతస్థాయి సహకార సంస్థలు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్లతో సమీకరణ ద్వారా పనితీరు మెరుగవడంతో పాటు పునరావృతం తగ్గడంతో పాటు ఆర్థిక సమగ్రత పెరుగుతుందన్నారు.
గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు
ఇదే సమయంలో 29వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో ధాన్య నిల్వ కేంద్రాల నిర్మాణం జరుగుతున్న ‘గ్రేయిల్ స్టోరేజ్ ప్లాన్’ రైతులకు మద్దతు ఇవ్వడంలో, మోలిక సదుపాయాలు బలోపేతం చేయడంలో, గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు. ఈ వర్క్షాప్ నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్, నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్ భాస్కర్, నాబార్డ్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్లు శ్రీ సంజయ్ గుప్తా, డా. సుమన్ కుమార్ పాల్గొన్నారు.
ఈ వర్క్ షాప్ కొత్త మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల (ఎంపిఎసిఎస్) స్థాపన, ఇప్పటికే ఉన్న పిఎసిఎస్, ఎంపిఎసిఎస్ కార్యకలాపాల విస్తరణ, రైతుల ఉత్పత్తిని కాపాడేందుకు ధాన్య నిల్వ సదుపాయాల నిర్మాణం వేగవంతం చేయడం, సంఘాల కంప్యూటరైజేషన్ ద్వారా పారదర్శకత ప్రభావిత్వం సాధించడం వంటి అంశాలపై చర్చించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: