జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణ బీజేపీకి పెద్ద దెబ్బగా మారాయి. ఎన్నికల ప్రారంభం నుంచే కాంగ్రెస్ (congress) పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించగా, బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మాత్రం ఈ పోటీలో ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చాలా వెనకపడ్డారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి బరిలో దిగినా, ఆయనకు కేవలం 17,061 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ఈ ఓట్ల సంఖ్య డిపాజిట్ కాపాడుకునే కనీస పరిమితికూడా చేరకపోవడంతో దీపక్ రెడ్డి డిపాజిట్‌ను కోల్పోయారు.
Read also: weather: నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి

Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ..
ఈ ఉపఎన్నిక పూర్తిగా తారుమారు చేసింది
అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ పట్టును పెంచాలని ఆశించిన పార్టీకి ఇది తీవ్ర నిరాశ కలిగించింది. తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నికల విజయాల జోష్‌లో ఉన్న బీజేపీకి, జూబ్లీహిల్స్ ఫలితం ఊహించని వెనుకడుగు అయింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందనుకున్న అంచనాలను ఈ ఉపఎన్నిక పూర్తిగా తారుమారు చేసింది. ఫలితాలు ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు ప్రారంభమయ్యాయి, అయితే బీజేపీ కార్యకర్తలు, స్థానిక నేతలు మాత్రం షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: