తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీస్తున్నాయి. నియామకాల్లో అవకతవకలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar)శనివారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం,”
అని స్పష్టం చేశారు.

గ్రూప్-1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణ
దయాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా గ్రూప్-1 (Group-1)పోస్టుల భర్తీ చేస్తున్నప్పటికీ, కేటీఆర్ “ఒక్కో పోస్టు రూ.3 కోట్లకు అమ్ముతున్నారని” చేసిన ఆరోపణలు తప్పుదోవకు దారితీసేలా ఉన్నాయని విమర్శించారు.అలాంటి తక్కువ స్థాయి వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న నాయకుడికి తగవు అని పేర్కొన్నారు.
చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్ రెడీ!
దయాకర్ తన వ్యాఖ్యల్లో, కేటీఆర్ వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. “మేం రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడంలో వెనుకాడం లేదు,”అని స్పష్టం చేశారు.
యువతలో అపోహలు సృష్టిస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలు?
దయాకర్ ఆరోపిస్తూ, కేటీఆర్ వ్యాఖ్యల వల్ల నిరుద్యోగ యువతలో అనవసర భయం, అపోహలు ఏర్పడుతున్నాయని తెలిపారు.”ఇటువంటి అనూహ్య వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభుత్వంపై అనవసర అవిశ్వాసాన్ని పెంచే ప్రమాదం ఉంది” అని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: