భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవితపై తీసుకున్న పార్టీ నిర్ణయంపై స్పందించారు. బీఆర్‌ఎస్ నుండి కవితను సస్పెండ్ చేసిన అంశం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
పార్టీ నిర్ణయమే తుది నిర్ణయం
ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, “కవిత(kavitha) గారిపై పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఇప్పటికే అమలులో ఉంది. ఆ తర్వాత నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు,” అని తేల్చి చెప్పారు. కవితపై తీసుకున్న వేటు పార్టీ అంతర్గతంగా జరిగిన వివరణాత్మక చర్చల తర్వాతే జరిగిందని ఆయన తెలిపారు. ఇది వ్యక్తిగత భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయం కాదు, పూర్తిగా పార్టీ ప్రోటోకాల్ ప్రకారం జరిగిందని స్పష్టం చేశారు.
“విషయాన్ని ఇక పొడిగించబోను” – కేటీఆర్ క్లారిటీ
ఈ అంశంపై మరిన్ని వ్యాఖ్యలు చేయాలన్న వత్తిడి వచ్చినా, కేటీఆర్ ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలిపారు. “పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, దానిపై మళ్లీ మునిగితేలడం అవసరం లేదు,” అని పేర్కొన్నారు.
read hindi news: hindi.vaartha.com
Read also: