జాతీయ భాష అవసరం ఉందా లేదా? ఈ అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కల్వకుంట్ల తారక రామారావు (KTR) హిందీ భాషా రగడపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. జైపూర్‌లో జరిగిన “టాక్ జర్నలిజం 2025” కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, విద్యార్థులతో జరిగిన సంభాషణలో హిందీ భాష (Hindi language)పై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు.

భాష భావవ్యక్తీకరణకు మాత్రమే – జాతీయ గుర్తింపుకాదు
ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ జాతీయ భాష కాదని, భారతదేశంలో అనేక అధికారిక భాషలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
భారతదేశంలో భాషా వైవిధ్యం – ఒకే భాష రుద్దటం అన్యాయం
“ఏ భాష అయినా భావవ్యక్తీకరణకు ఓ సాధనం మాత్రమే. అది ఒక సాంస్కృతిక చిహ్నం. భారత్ లో 20 అధికారిక భాషలు (20 official languages in India), 300 అనధికార భాషలు ఉన్నాయి. హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదు. తెలుగు భాషను జాతీయ భాషగా చేయాలని ప్రతిపాదిస్తే మిగతా ప్రాంతాల వారు ఒప్పుకుంటారా? 70-80 ఏళ్ళు దేశం బాగుంటే, మళ్లీ జాతీయ భాష ఎందుకు?” అని ప్రశ్నించారు.
“హిందీకి కోటి రూపాయలు.. మిగిలిన భాషల పరిస్థితి ఏంటి?”
హిందీ భాషకు బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించి, తెలుగు, బెంగాలీ భాషలకు ఎందుకు నిధులు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ప్రజలపై తెలుగును రుద్దనప్పుడు హిందీని తమపై ఎందుకు రుద్దుతున్నారని ఆయన నిలదీశారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అయినప్పటికీ, హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకే వదిలేయాలని, దానిని వారిపై బలవంతంగా రుద్దకూడదని ఆయన అన్నారు .
Read hindi news: hindi.vaartha.com