हिन्दी | Epaper

KTR: కేసీఆర్‌ను విమర్శించే వారిని ఎన్నిసార్లు ఉరితీయాలి?

Saritha
KTR: కేసీఆర్‌ను విమర్శించే వారిని ఎన్నిసార్లు ఉరితీయాలి?

కరువు నేలల్లో సిరులు పండించి రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపిన గొప్ప పరిపాలకుడు కేసీఆర్.. అలాంటి కేసీఆర్ (KCR) ను తిడుతున్న వారిని ఎన్నిసార్లు ఉరితీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్ లో ‘నదీ జనాలు-కాంగ్రెస్‌ ద్రోహాలు’అంశంపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ను ఎన్నిసార్లు ఉరితీయాలని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని.. 420 హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 సార్లు ఉరితీయాలని అన్నారు.

Read also: Sangareddy Crime: ఆర్టీసీ బస్సు ఢీ.. జిమ్ ట్రైనర్ దుర్మరణం వీడియో వైరల్

KTR: కేసీఆర్‌ను విమర్శించే వారిని ఎన్నిసార్లు ఉరితీయాలి?

చెక్ డ్యాములు పేల్చేసే చెత్త ప్రభుత్వమంటూ కాంగ్రెస్ పై ఫైర్

చరిత్రలో ఎన్నో చూశాం కానీ చెక్‌ డ్యామ్‌లను పేల్చేసే ఇలాంటి చెత్త ప్రభుత్వం ఇంకెక్కడా చూడలేమని (KTR) కేటీఆర్ అన్నారు. నదీజలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహాలకు కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నామని చెప్పారు. అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానాయుకుడు, తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన నాయకుడు, రైతుబంధు కేసీఆర్‌ ను రేవంత్‌ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య వాదుల బూట్లు పాలిష్‌ చేసిన అల్పుడి చేతిలో తెలంగాణ ఉండటం బాధగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డికి బేసిన్లు, బేసిక్స్‌ తెలవదని ఎద్దేవా చేశారు. వట్టెం, సుంకిశాలకు నష్టం జరిగితే బాగు చేయలేని అసమర్థ నాయకుడని విమర్శించారు. పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరుగడం లేదని కేటీఆర్ ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

📢 For Advertisement Booking: 98481 12870