తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత, ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున లాలాగూడలోని ఇంట్లో కుప్పకూలి పడిపోయిన అందెశ్రీ ని కుటుంబసభ్యులు హుటాహుటిన, గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital) కు తరలించారు. అయితే, ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
Read also: Jubilee Hills election: డబ్బులు పంచుతూ పట్టుబడ్డ 11 మంది అరెస్ట్

కేటీఆర్ (KTR) తీవ్ర విచారం
ఆయన మరణవార్తతో తెలంగాణ సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. అందెశ్రీ (Ande Sri) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఆయన మరణం తెలంగాణ సాహితీ రంగానికి, రాష్ట్రానికి పూడ్చలేని నష్టమని తెలిపారు. శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: