జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) మరియు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, “మొదట హైదరాబాదు, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు గత రెండేళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పి తర్వాతే ఓట్లు అడగాలి” అంటూ రేవంత్ రెడ్డిని సవాల్ విసిరారు.
HYD Metro : హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
కేటీఆర్ వ్యాఖ్యల్లో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కన్పించింది. “జూబ్లీహిల్స్‌లో ఓటమి భయం పట్టుకుని సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు” అని కేటీఆర్ అన్నారు. “మేము కూడా ఆయన భాషలోనే మాట్లాడగలుగుతాం, కానీ మేము గౌరవంగా వ్యవహరిస్తాం” అని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాదును అభివృద్ధి పథంలో నడిపించిందని, రేవంత్ ప్రభుత్వం మాత్రం రెండు ఏళ్లలో గణనీయమైన పనులు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు.

అదేవిధంగా, “గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, రెండు ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో ప్రజల ముందుంచి చర్చకు సిద్ధమా?” అంటూ కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. “చెత్త ఎవరిది, సత్తా ఎవరిది అన్నది ప్రజలే తీర్పు చెబుతారు” అని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి ఉపఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఇరు పార్టీలూ భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/