తెలంగాణ రాజకీయ రంగంలో మరోసారి కొండా సురేఖ ఫ్యామిలీ హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన నాయకులుగా ఉన్న కొండా సురేఖ (Konda Surekha) – కొండా మురళీ దంపతులు ఇటీవల కేంద్ర పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, వారి కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, గతంలో వచ్చిన వివాదాలు, ఇటీవలి సమావేశం వరంగల్ రాజకీయాలకు సంబంధించి పలు కీలక విషయాలను మీనాక్షికి వివరించారు.

కూతురు సుస్మిత వ్యాఖ్యలు – చర్చనీయాంశం
కొండా మురళీ, సురేఖ (Konda Surekha) దంపతుల కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు స్పందించారు. తన కూతురు తొందర పడి అన్నదో ఆలోచించి అన్నదో తనకు తెలియదని కొండా మురళీ అన్నారు. తన కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని సుస్మిత ఏమి అనుకుంటుందో తనకు తెలియదన్నారు. కొండా సురేఖ మాత్రం తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అధికారం తన కూతురుకు ఉందని వ్యాఖ్యానించారు. తన ఆలోచనను కాదనలేమని అయితే పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలని చెప్పారు.
మీనాక్షికి 16 పేజీల నివేదిక – అసంతృప్తి వెల్లడి
ఈ నేపథ్యంలో కొండా దంపతులు మీనాక్షి నటరాజన్‌ను కలిసినప్పుడు, మీనాక్షికి ఏకంగా 16 పేజీల నివేదికను (16-page report) వారు అందజేశారు. వరంగల్ జిల్లా గ్రూప్ రాజకీయాల గురించి అందులో వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కొండా మురళీ పనిచేసే వాళ్లపైనే రాళ్లు విసురుతారని అన్నారు. గ్రూప్ రాజకీయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
పరకాల టికెట్ వెనుక అసంతృప్తి
కొండా మురళీ మీడియాతో మాట్లాడుతూ- పరకాల టికెట్ రేవూరి ప్రకాశ్ రెడ్డికి దక్కడం వల్ల కొండా ఫ్యామిలీ అప్పటి నుంచే అసంతృప్తిలో ఉంది. అప్పుడే సుస్మిత రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైనప్పటికీ, అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా ఆమె వ్యాఖ్యలు, మళ్లీ అదే అసంతృప్తి ప్రతిబింబంగా కనిపించాయి.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని కొండా మురళీ చెప్పారు. మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాకు సంబంధించిన కొంత మంది పార్టీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారిన ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకోవడం తన బాధ్యత అని అన్నారు. తాను వెనకబడిన వర్గాల నుంచి వచ్చానని ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Read also: Road Accident: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? కవిత ఏమన్నారంటే..