हिन्दी | Epaper

Telugu News: Konda Surekha:ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి క్షమాపణన చెప్పిన కొండా సురేఖ !

Sushmitha
Telugu News: Konda Surekha:ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి క్షమాపణన చెప్పిన కొండా సురేఖ !

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, (Konda Surekha)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, తన శాఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ వ్యవహారంపై ఆమె స్పందించారు. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ మధ్య జరిగిన గొడవలు మిస్ అండర్‌స్టాండింగ్‌తోనే జరిగాయన్నారు.

Read Also: Pak-Afghan : పాక్‌-అఫ్ఘాన్‌ బార్డర్‌ క్లోజ్‌..

కూతురు వ్యాఖ్యలపై క్షమాపణ

“కుటుంబం అన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి, సర్దుకుని ముందుకు వెళ్లాలి” అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. తన ఇంటికి పోలీసులు రావడంతోనే తన కూతురు ఆవేశంతో మాట్లాడిందని, తన కూతురు తరపున సీఎం రేవంత్ రెడ్డికి(Revanth Reddy) తాను క్షమాపణలు చెబుతున్నానని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కాంగ్రెస్ ఒక పెద్ద కుటుంబం అని, ఇవి ‘టీ కప్పులో తుఫాను’ మాదిరిగా వచ్చే గొడవలు మాత్రమేనని చెప్పారు. దీంతో కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదానికి తెర పడినట్లు అయింది.

 Konda Surekha
Konda Surekha

సుస్మిత ఆరోపణలు

అయితే, ఈ వివాదానికి ముందు మంత్రి కూతురు కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. తమ తల్లి (కొండా సురేఖ) ఒక బీసీ మహిళా మంత్రి కావడంతో ఆమెను రాజకీయంగా అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్డి వర్గం నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె పేర్లతో సహా ప్రస్తావించారు. సీఎం సోదరులు భూములు అక్రమించుకోవాలని చూస్తున్నారని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కొండా సురేఖ ఎవరికి క్షమాపణ చెప్పారు?

తన కూతురు చేసిన వ్యాఖ్యల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు.

కొండా సురేఖ కూతురు సుస్మిత ప్రధానంగా చేసిన ఆరోపణ ఏమిటి?

బీసీ మంత్రి అయిన తన తల్లిని రాజకీయంగా అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్డి వర్గం నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870