హైదరాబాద్ : కేంద్రం తెస్తున్న విత్తన చట్టం రైతులకు ఆమోదయోగ్యంగా లేదని తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి(Kodanda Reddy) అన్నారు. ఈ విత్తన చట్టం మల్టీనేషనల్ విత్తన కంపెనీలు కోసమే అన్నట్లుగా ఉందని విమర్శించారు. కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. రైతు కమిషన్ కార్యాలయంలో కేంద్రం తీసుకొస్తున్న విత్తన చట్టం ముసాయిదాపై సమీక్ష నిర్వహించారు.
Read Also: Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ

విత్తన కంపెనీల లోపాలు సవరించుకోవాల్సిన అవసరం
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే విత్తనోత్పత్తి కి తెలంగాణ(Telangana) కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచదేశాలకు తెలంగాణ విత్తనం ఎగుమతి అవుతుందని చెప్పారు. తెలంగాణలో విత్తన కంపెనీల తీరు కూడా బాగాలేదని సీడ్స్ కంపెనీలు కూడా వారి లోపాలను సవరించుకోవాలన్నారు. రైతుకు నష్టం లేకుండా చట్టం ఉండాలని, దానికి కంపెనీలు కూడా చెబుతున్నాయన్నారు. ఆర్గనైజర్ల వ్యవస్థతో రైతులకు కంపెనీలకు కూడా నష్టమేనని నిర్ధారణకు వచ్చాయని వివరించారు. కానీ లక్షలాది మంది రైతుల వద్దకు నేరుగా కంపెనీ వెళ్లలేని పరిస్థితుల్లో ఈ ఆర్గనైజర్లు వచ్చారని తెలిపారు.
విత్తన అనుమతులు మరియు ధర నిర్ణయం
నకిలీ విత్తనం విషయంలో రైతులకు నష్ట పరిహారం అందించాలని స్పష్టం చేశారు. కేంద్రం తెస్తున్న చట్టంలో క్లారిటీ లేదని వ్యాఖ్యానించారు. రైతులు కోర్టులను ఆశ్రయించాలంటే వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియని విధంగా ఉందన్నారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇవ్వడం, ధర నిర్ధారణ అంత రాష్ట్ర పరిధిలో ఉండాలని కేంద్రాన్ని కోరారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: