ఖమ్మం(Khammam) జిల్లాలోని వేపకుంట్ల గ్రామానికి చెందిన రైతు పొట్లపల్లి నాగరాజు, తన కుమారుడు మణికంఠను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నిలబెట్టాలని తలచి అరుదైన నిర్ణయం తీసుకున్నారు. పంట పండించే ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమిని పూర్తిగా క్రికెట్ మైదానంగా రూపుదిద్దుతూ ఆయన తన కలను కార్యరూపం దించారు. కుమారుడి శిక్షణ కోసం ప్రత్యేక పిచ్‌లు, పచ్చిక మైదానం, ఆటగాళ్ల విశ్రాంతి గదులు వంటి అన్ని సౌకర్యాలను స్వంతంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సుమారు రూ.35 లక్షలు ఖర్చు చేసి, మైదాన నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.50 వేల వ్యయం చేస్తూ ఇద్దరు సిబ్బందిని నియమించుకున్నారు.
Read Also: BCCI: బీసీసీఐ నేడు కీలక సమావేశం?
నాగరాజు నిర్మించిన ఈ ప్రైవేట్ క్రికెట్ గ్రౌండ్ ఇప్పుడు ఖమ్మం(Khammam) పరిసర ప్రాంతాల క్రికెట్ ప్రేమికులకు కూడా అద్భుత వేదికగా మారింది. వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, సమీప జిల్లాల జట్లు – ప్రతి ఆదివారం ఇక్కడకు వచ్చి మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఖర్చుల కోసం కేవలం నామమాత్రపు రుసుము మాత్రమే తీసుకుంటున్నారు.
అండర్-19 తెలంగాణ జట్టులో చోటు సంపాదించిన మణికంఠ
వివిధ స్థాయిల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసిన మణికంఠ ఆటలో ప్రత్యేక మెరుగుదల వచ్చింది. రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీలో రాణించిన ఆయన, ఇప్పుడు అండర్-19 తెలంగాణ జట్టులో స్థానం దక్కించుకుని 2026 జనవరిలో రాజస్థాన్‌లో జరగనున్న పాఠశాల జాతీయ క్రీడల్లో పాల్గొననున్నాడు. భవిష్యత్తులో టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో మణికంఠ శ్రమించుతున్నాడు. కుమారుడి కల కోసం భూమిని మైదానంగా మార్చిన తండ్రి నాగరాజు కథ ప్రస్తుతం ప్రాంతంలో ప్రేరణగా మారింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: