हिन्दी | Epaper

Greenfield Highway: మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

Aanusha
Greenfield Highway: మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

Greenfield Highway: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్మిస్తున్న ఖమ్మం-దేవరపల్లి (NH-365BG) గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు రూ. 4,451.87 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ 162 కిలోమీటర్ల రహదారిని మే 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి, మిగిలిన ఫినిషింగ్ పనులను అధికారులు వేగవంతం చేశారు.

ప్రయాణ దూరంతో పాటు 4 గంటల సమయం ఆదా

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా సుమారు 676 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ మార్గం అందుబాటులోకి వస్తే:

  • దూరం: సుమారు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది.
  • సమయం: ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోవడం వల్ల సుమారు 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి ఏలూరు జిల్లా మీదుగా దేవరపల్లి వద్ద ముగుస్తుంది.
Khammam-Devarapalli Greenfield Highway to be launched in May!
Khammam-Devarapalli Greenfield Highway to be launched in May!

ఈ హైవే అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS) ద్వారా ప్రతి 2 కిలోమీటర్లకు ఒక 360-డిగ్రీల సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను ఈ కెమెరాలు గుర్తించి ఆటోమేటిక్‌గా చలాన్లు జారీ చేస్తాయి. రహదారిపైకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించారో, ఆ దూరానికే టోల్ వసూలు చేస్తారు. ఇందుకోసం కేవలం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చోట హోటళ్లు, వాష్‌రూమ్‌లు, పెట్రోల్ బంకులతో కూడిన “వే సైడ్ ఎమినిటీస్” నిర్మిస్తున్నారు. రోడ్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంకుల వివరాలు తెలుసుకోవచ్చు. రహదారి పొడవునా సోలార్ ప్యానెల్స్‌తో కూడిన ఆటోమేటిక్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!

రేపే ఆయేషా మీరా శరీర అవశేషాల అప్పగింత.. తెనాలిలో భారీ బందోబస్తు!

హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీల సందడి

హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీల సందడి

శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం

శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం

అస్సాంలో దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది అఘాయిత్యం.

అస్సాంలో దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది అఘాయిత్యం.

పని చేసే చోట వేధింపులు సహించం.. ఐసీసీ కమిటీలు తప్పనిసరి: రాయపాటి శైలజ.

పని చేసే చోట వేధింపులు సహించం.. ఐసీసీ కమిటీలు తప్పనిసరి: రాయపాటి శైలజ.

షాద్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

షాద్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

కడ్తాల్‌లో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు

కడ్తాల్‌లో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం

నిత్యమల్లి పూల సాగుతో రూ. 1.2 కోట్ల లాభం!

నిత్యమల్లి పూల సాగుతో రూ. 1.2 కోట్ల లాభం!

భవిష్యత్తు తరగతి గదుల్లోనా, బడ్జెట్ అంకెల్లోనా?

భవిష్యత్తు తరగతి గదుల్లోనా, బడ్జెట్ అంకెల్లోనా?

దంచికొడుతున్న వర్షం
0:10

దంచికొడుతున్న వర్షం

📢 For Advertisement Booking: 98481 12870