బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) కుటుంబంలో విషాదం నెలకొంది. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ (Satyanarayana Rao) గారు ఈ వేకువజామున కన్నుమూశారు.
Read Also: Harish Rao: హరీశ్ రావు తండ్రి కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ఆయన మరణవార్త తెలియగానే హరీశ్‌రావు కుటుంబం, బంధువులు, స్నేహితులు, అభిమానులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో విషాద వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున హరీశ్‌రావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.

కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి
సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్… హరీశ్‌రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
తన బావ అయిన సత్యనారాయణ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: