BRS meeting December 19 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 19న బీఆర్‌ఎస్‌ఎల్పీతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుంది.
ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా–గోదావరి జలాల అంశం, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ సాగునీటి హక్కుల విషయంలో మరోసారి ప్రజా ఉద్యమం తప్పదని కేసీఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Read also: Amit Shah: నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే సరిపోతుందంటూ కేంద్రం ముందు తలవంచిందని కేసీఆర్ తీవ్రంగా విమర్శించినట్లు సమాచారం. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఈ అంశంపై నోరు మెదపకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడాలంటే (BRS meeting December 19) బీజేపీ, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా మరోసారి ఉద్యమమే శరణ్యమని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ సమయానికి పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందేవని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. ఈ అంశాలన్నింటిపై లోతైన చర్చ కోసం డిసెంబర్ 19న జరిగే ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: