కవిత (Kavitha) పై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..”కారణజన్ముడి కడుపున కవిత (Kavitha) లాంటి రాక్షసి పుట్టడం దురదృష్టకరం” అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తన వ్యాపారాలను కాపాడుకునేందుకే కవిత.. తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ (KTR) తో పాటు పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో BRS MLAల ఫిరాయింపు కేసు విచారణ

ఎమ్మెల్యే క్రాంతితో కలిసి చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు
నిన్న సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతితో కలిసి చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆమెకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇప్పుడు ‘జనం బాట’ పేరుతో యాత్ర చేస్తూ ప్రజా సమస్యలను వదిలేసి,
హరీశ్‌రావును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిపించిన హరీశ్‌రావు (Harish Rao) పై చేసిన వ్యాఖ్యలకు కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “నిజామాబాద్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?” అని ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రశ్నించగా, కేసీఆర్ కుమార్తెగానే కవితకు గుర్తింపు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: