బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నల్గొండ జిల్లాలో ఓ నాయకుడు బీఆర్‌ఎస్‌ను నాశనం చేశారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు ఎవరి వైపు ఉంటాయో అనే చర్చ సాగుతోంది. “నల్గొండలో ఓడిపోవడానికి కారణమైన నేతలు ఉన్నారు. ఒకరు గెలిచి మిగతా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించారు” అని కవిత పేర్కొన్నది రాజకీయంగా దుమారం రేపుతోంది.
లక్ష్యం జగదీశ్ ?
నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచింది జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy) ఒక్కరే. అంతకుముందు కవితపై జగదీశ్ రెడ్డి చేసిన విమర్శలు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కవిత చేసిన ‘లిల్లీఫుట్’ వ్యాఖ్యలు జగదీశ్ రెడ్డినే టార్గెట్ చేస్తూ చేసినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగదీశ్ రెడ్డి నల్గొండలో తన స్వార్థం కోసం పార్టీలో విభజనలు సృష్టించి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఈ వ్యాఖ్యల తీవ్రత మరింత పెరిగింది.
బీఆర్‌ఎస్ లో ఇంటర్నల్ వార్?
కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ లోని అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కేసీఆర్ పార్టీ నేతలకు వ్యాఖ్యలపై స్పందించవద్దని చెప్పినా, కవిత-జగదీశ్ రెడ్డి మధ్య విమర్శల తాకిడి కొనసాగుతుండటం గులాబీ పార్టీలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. నల్గొండ జిల్లాలోని నేతల మధ్య నడుస్తున్న ఈ అంతర్గత సంఘర్షణ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ లో మళ్లీ గ్రూప్ రాజకీయాలను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.
Read Also : Sircilla: అగ్గిపెట్టెలో పట్టే ఆపరేషన్ సింధూర్ శాలువా తయారు చేసిన సిరిసిల్ల నేతన్న